ట్రంప్ ప్రసంగ పత్రాన్ని చింపేసిన స్పీకర్
స్పీకర్ నాన్సీ పెలోసీతో చేతులు కలిపేందుకు నిరాకరించిన ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసికి మధ్య విభేదాలు ఉన్నా విషయం తెలిసిందే. అయితే అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ట్రంప్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఆ ప్రసంగానికి ముందు ఆయన స్పీకర్ నాన్సీ పెలోసీతో చేతులు కలిపేందుకు నిరాకరించారు. ప్రసంగానికి ముందు ట్రంప్ తన దగ్గర ఉన్న ప్రసంగ ప్రతులను స్పీకర్ నాన్సీకి ఇచ్చారు. ట్రంప్ నిలుచుని ప్రసంగం చేసే వేదిక వెనుకే ఉన్న టేబుల్‌పై కూర్చున్న స్పీకర్ నాన్సీకి.. ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ప్రసంగ పాఠాన్ని అందుకున్న నాన్సీ.. ఆ తర్వాత ట్రంప్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ట్రంప్ మాత్రం ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మైక్ వైపు తిరిగారు. ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో.. ఆగ్రహం మీదున్న నాన్సీ.. చివర్లో ఆ ప్రసంగ కాపీని చింపేశారు. ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించగానే.. ఆమె తన చేతిలో ఉన్న ఆ పేపర్లను రెండు ముక్కలు చేసి తన నిరసనను వ్యక్తం చేశారు. ట్రంప్‌పై అభిశంసనకు సేనేట్‌లో చర్యలు చేపట్టింది నాన్సీనే కాబట్టి.. ట్రంప్ ఆమెతో చేతులు కలిపేందుకు నిరాకరించినట్లు అర్థమవుతోంది. ట్రంప్‌పై అభిశంసనకు మూల కారణమైన నాన్సీతో గత అక్టోబర్ నుంచి ట్రంప్ మాట్లాడడంలేదు. సభల సమయంలో ఎదురుపడ్డా వారి మధ్య ఎటువంటి పలకరింపులు లేవు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/