ఐసిస్‌ నూతన నాయకుడి గురించి మాకు తెలుసు

ట్విట్టర్ లో స్పందించిన ట్రంప్

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: ఇటీవలే ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైన సంగతి తెలిసిందే. అమెరికా దళాల దాడులకు భయపడిన బాగ్దాదీ తనను తాను పేల్చుకున్నాడు. అయితే, బాగ్దాదీ తర్వాత ఐసిస్ పగ్గాలు చేపట్టేది అబు ఇబ్రహీమ్ అల్ హష్మీ అల్ ఖురేషీ అని వెల్లడైంది. ఐసిస్ ఓ ప్రకటనలో ఈ విషయం తెలియజేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐసిస్ కు నాయకత్వం వహించబోయేది ఎవరో మాకు బాగా తెలుసు అంటూ ట్విట్టర్ లో స్పందించారు. కాగా, బాగ్దాదీ మృతిని ధ్రువీకరించిన ఐసిస్ వర్గాలు తమ ప్రతీకార దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అమెరికాను హెచ్చరించాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/