అమెరికాలో ఉన్న సమస్య వేరే దేశాల్లో లేదు

అమెరికా అడవుల్లో తరచూ మంటలు

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా అడవులలో రాజుకున్న అగ్ని రోజురోజుకు విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అన్ని దేశాల్లో మంటలు అంటుకునే చెట్లు ఉన్నాయని, కానీ, అమెరికాలో ఉన్న సమస్య, వేరే దేశాల్లో లేదని అన్నారు. త్వరలోనే ఈ మంటలు చల్లారుతాయని వెల్లడించిన ఆయన, ఇదేమీ వాతావరణ మార్పులతో వచ్చిన సమస్య కాదని, మేనేజ్ మెంట్ కు సంబంధించిన విషయమని అభివర్ణించారు. అడవుల్లో మంటలకు సైన్స్ కు సంబంధం ఉందని తాను భావించడం లేదని స్పష్టం చేశారు. . త్వరలోనే మంటలు చల్లబడతాయి మీరే చూడండి అని ట్రంప్‌ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/