నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ నామినేట్‌

ట్రంప్ ను నామినేట్ చేసిన నార్వే పార్లమెంటు సభ్యుడు

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చినందుకుగానూ ఆయన పేరును నార్వేజియన్ పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెజెడ్డే నామినేట్‌ చేశారు. టైబ్రింగ్ జెజెడ్డే నార్వేజియన్ పార్లమెంటులో నాలుగుసార్లు సభ్యుడు. నాటో పార్లమెంటరీ అసెంబ్లీకి నార్వేజియన్ ప్రతినిధిగా పనిచేస్తున్నారు. యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య మెరుగైన సంబంధాల స్థాపనలో కీలక పాత్ర పోషించినందుకు ట్రంప్‌ పేరును నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేసినట్లు జెజెడ్డే పేర్కొన్నారు. అయితే, నవంబర్‌లో అమెరికాలో ఎన్నికలు జరుగనున్న వేళ ట్రంప్‌ పేరు నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ కావడం గమనార్హం.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/