ఎన్నికలకు ముందు ఆస్తుల వివరాలు వెల్లడి

Donald Trump
Donald Trump

Washington: వచ్చే ఏడాదిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు తన ఆస్తుల వివరాలు వెల్లడించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తన ఆర్థిక నివేదికను వెల్లడించనున్నట్టు తెలిపారు. తన కుటుంబ ఆస్తులపై ప్రభుత్వం అత్యధిక స్థాయిలో ఖర్చులు చేస్తోందన్న ఆరోపణలపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్‌లో ఉన్న ట్రంప్‌ భవనంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ బస్‌ చేయడంతో ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. వచ్చే ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే తన ఆస్తుల వివరాలు వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేస్తానని ట్రంప్‌ పేర్కొన్నారు.