ప్రచారం రంగంలోకి దిగిన మోలానియా ట్రంప్‌

పెన్సిల్వేనియా ఎన్నికల సభలో పాల్గొన్న మెలానియా

donald-trump-is-a-warrior-says-melania-trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తొలిసారి ప్రచారం రంగంలోకి అడుగుపెట్టారు. నిన్న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అట్‌గ్లెన్ పట్టణలో జరిగిన ఓ ఎన్నికల సభలో ట్రంప్ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త నిజమైన యోధుడని కొనియాడారు. దేశమంటే ఆయనకు అపారమైన ప్రేమ అని, అందుకోసం ఆయన ప్రతి రోజూ పోరాడతారని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా అమెరికా అధ్యక్షుడు ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉండడం దేశ చరిత్రలోనే తొలిసారన్నారు. కరోనా సోకినప్పుడు తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మెలానియా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన 2.25 లక్షల మంది కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొవిడ్‌పై తప్పక విజయం సాధిస్తామని మెలానియా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/