లార్డ్స్‌లో టెస్టు అరంగేట్రంపై జోఫ్రా

Jofra Archer
Jofra Archer

హైదరాబాద్: లార్డ్స్‌ వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో యాషెస్ టెస్టులో తాను టెస్టు అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెప్పాడు. అయితే, తొలి టెస్టులోనే తన నుంచి అద్భుతాలు ఆశించొద్దని ఈ సందర్భంగా తెలిపాడు.ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐదు టెస్టుల యాషెస్ టెస్టు సిరిస్‌లో చోటు దక్కించుకున్నప్పటికీ గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు గాయం తిరగబెట్టడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ టెస్టు అరంగేట్రానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ నాకు ఏ ఫార్మాట్‌ క్రికెట్‌ అయినా ఒకటేనని, ఈ ఫార్మాట్‌లోనే ఆడతాననే నిబంధనలు ఏమీ లేవు అని చెప్పుకొచ్చాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/