మెహుల్‌ చోక్సీకి ఎదురుదెబ్బ

బెయిల్ ఇచ్చేందుకు డొమినికా కోర్టు నిరాకరణ

డొమినికా: బ్యాంకులను మోసగించిన కేసులో నిందితుడు మెహుల్ చోక్సీకి బెయిలు మంజూరు చేసేందుకు డొమినికా హైకోర్టు తిరస్కరించింది. డొమినికాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి పారిపోనని ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకోలేదు. తన సోదరుడితో కలిసి ఉంటానని కోర్టుకు తెలుపగా.. అది స్థిర నివాసం కాదని పేర్కొంది. చోక్సీపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదని గుర్తించిన కోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్నత తర్వాత న్యాయమూర్తి బెయిల్‌ ఇవ్వకూడదని నిర్ణయించారు. బెయిల్‌ కోసం కోర్టు ఎదుట బలమైన పూచీకత్తును ఇవ్వలేదని, విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది.

కగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో రూ.13,500 కోట్ల రుణం ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్‌ చోక్సీ 2018లో భారత్‌ విడిచి ఆంటిగ్వా బార్బుడాకు పారిపోయిన విషయం తెలిసిందే.,

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/