15 నుంచి ప్రారంభం కానున్న దేశీయ విమాన సర్వీసులు..!

aeroplane
aeroplane

దిల్లీ: ప్రస్తుతం దేశంలో అత్యవసర సేవలు మినిహా మిగతా అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. దేశంలో లాక్‌డౌన్‌ కోనసాగుతండడం ఇందుకు కారణం. కాగా ఈ నెల 14 వ తేదితో లాక్‌డౌన్‌ గడువు ముగియనుండడం, ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తుందినే ప్రభుత్వ వర్గాలు భావిస్తుండడంతో.. దేశీయ విమాన సర్వీసులు ఈ నెల 15 నుంచి మళ్లీ మొదలవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే పలు విమాన సంస్థలు బుకింగ్స్‌ను కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఎయిర్‌ ఇండియా సంస్థ మాత్రం ఈ నెల 30 వరకు తమ సర్వీసులను ప్రారంభించబోమని స్పష్టంచేసింది. కాగా మిగతా విమాన సంస్థలు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/