పెరిగిన వంట గ్యాస్‌ ధరలు

మెట్రో నగరాల్లో రూ.37 వరకు పెరిగిన ధర

LP Gas Cylinder
LP Gas Cylinder

న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా భారీగా తగ్గిన వంట గ్యాస్‌ సిలెండర్‌ ధర ఇప్పడు మళ్లీ పెరిగింది. సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై ఈ రోజు మెట్రో నగరాల్లో రూ.37 వరకు ధర పెరిగింది. అయితే పెరిగిన ఈ కొత్త ధరలు ఈ రోజు నుంచే  అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.11.50 పెరిగినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) పేర్కొంది. కోల్‌కతాలో రూ.31.50, ముంబైలో రూ.11.50, చెన్నైలో రూ.37 పెరిగింది. 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో నిన్నటి వరకు రూ.581.50 ఉండగా, ఇప్పుడు రూ.593కి చేరింది. కోల్‌కతాలో నిన్నటి వరకు రూ.584.50కి ఉండగా, ఇప్పుడు 616కి పెరిగింది. ముంబైలో నిన్నటి వరకు 579 రూపాయలు ఉండగా, 590.50కి చేరింది. అలాగే, చెన్నైలో నిన్నటి వరకు రూ.569.50 ఉండగా, ఇప్పుడు 606.50కి చేరింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/