డాలర్‌ కరెన్సీ నోట్ల కట్టలతో కుర్చీ

7.17 కోట్లు ధర పలుకుతున్న డాలర్‌ కుర్చీ

dollar note chair
dollar note chair

రష్యా: రష్యాలోని కొందరు ఔత్సాహికులు డాలర్‌ కరెన్సీ నోట్ల కట్టలతో కుర్చీని తయారు చేసి ఒక ప్రత్యేక ప్రదర్శనలో ఉంచారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకర్షించింది. ఔత్సాహికులు ఈ కూర్చీని వేలానికి కూడా పెట్టారు. అయితే వీటిధర మాత్రం మామూలుగా లేదు. 7.17 కోట్లు వెచ్చించి కొనాల్సిందే. గాజుపలకలతో ప్రేమ్‌ తయారుచేసి వాటిమధ్య డాలర్ల కట్టలు ఉంచారు. అందువల్లనే ఈకుర్చీకి అంత ఖరీదని తేలింది. ఈ కుర్చీని కొనేందుకు అందరు ఉత్సాహం చూపిస్తున్నా ధరను చూసి గతుక్కమంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/