ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సిఎం శ్రమిస్తున్నారు

 Dokka Manikya Varaprasad
Dokka Manikya Varaprasad

అమరావతి: ఇటివల ఏపిలో నిర్వహించిన ఎన్నికలు ఈసీ సరైన కసరత్తు చేయకుండానే జరిపిందని, భవిష్యత్‌లో ఇలాంటి పొరపట్లు జరగాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. టిడిపి ప్రభుత్వం స్పష్టమైన ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా ఎన్నికల సంస్కరణలు జోరందుకుంటున్న తరుణంలో మోడి ప్రభుత్వం వచ్చాక ఆ వేగానికి గండిపడిందని మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోడి ప్రభావితం చేశారని ధ్వజమెత్తారు. ఈసీ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/