చంద్రబాబు దీక్ష చేయడం హాస్యాస్పదం

Peddireddy Ramachandra Reddy
Peddireddy Ramachandra Reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ఇసుక దీక్షపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఇసుక మాఫియాను నడిపించిన చంద్రబాబు ఇప్పుడు కూలీల పేరుతో మొసలీకన్నీరు కారుస్తూ దీక్షకు కూర్చోవడం హాస్యాస్పదమని రామచంద్ర రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బాబు రాజకీయ లబ్దికోసం చేసే దీక్షలు, నాటకాలు తెలుగు ప్రజలు విశ్వసించరని ఎద్దేవా చేశారు. విజయవాడలో బాబు దీక్ష నేపథ్యంలో ఆయన మాట్లడుతూ..చార్జిషీట్‌ విడుదల చేసి చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, వైఎస్‌ఆర్‌ పాలనలో ఎక్కడా ఇసుకు మాఫియా లేదని గుర్తు చేశారు. ఇంకా వరదల కారణంగా ఇన్నాళ్లు ఇసుక కొరత ఉన్నా గత కొన్ని రోజుల నుంచి ఇసుక పుష్కలంగా లభిస్తోందని అని చెప్పారు. సగటున రోజుకి లక్షన్నర టన్నుల ఇసుక అందుబాటులోకి వచ్చిందని, ప్రస్తుతం రోజుకి రెండు లక్షల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే గ్రామాల్లో కూడా తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/