శాసన సభ సభ్యుడికి అసెంబ్లీ వచ్చే హక్కు ఉందా? లేదా ?

Gorantla Butchaiah Chowdary
Gorantla Butchaiah Chowdary

అమరావతి: టిడిపి సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిన్న టిడిపి సభ్యులను అసెంబ్లీ గేట్‌ వద్ద మార్షల్స్‌ అడ్డుకోవడంపై శుక్రవారం అసెంబ్లీలో అధికార, టిడిపి సభ్యుల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ..శాసన సభ్యుడికి అసెంబ్లీకి వచ్చే హక్కు ఉందా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, టిడిపి సభ్యులు వచ్చే సమయానికి గేటుకు ఎందుకు తాళాలు వేశారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. గేటు దగ్గర ఉన్న వాళ్లంతా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలేనని బుచ్చయ్య చౌదరి వివరించారు. చంద్రబాబు చేతిలో ఉన్న కాగితాలను మార్షల్స్‌ లాక్కున్నారని ఆరోపించారు. సభలో లేని లోకేష్‌ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. సభలో వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా..లేదా నియంతృత్వ పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/