లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ కాలుని తొలగించిన వైద్యులు

Loco Pilot chandrasekhar
Loco Pilot chandrasekhar

హైదరాబాద్‌: కాచిగూడలో ఎంఎంటిఎస్‌ రైలు హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఘటన అందరి కలచివేస్తుంది. కాగా ఈ ప్రమాదంలో ఎంఎంటిఎస్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ను ఎడిఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా శ్రమించి అతనిని బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతనికి శస్త్ర చికిత్స జరిగిందని కేర్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అతని కుడికాలుకు తీవ్రంగా గాయాలయిన కారణంగా దానిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఇంకా లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ పరిస్థితి విషమంగానే ఉందని, అతని ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తామని కేర్‌ సిబ్బంది తెలిపారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/