9 నిమిషాల పాటు దీప ప్రజ్వలన చేయండి… మోదీ

మరొకసారి అందరూ ఏకతాటిపైకి రావాలి.

narendra modi
narendra modi

దిల్లీ: కరోనా పై పోరులో దేశం మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేయాలని ప్రధాని మోది అన్నారు. ఏప్రిల్‌ 5వ తేదిన ఆదివారం రాత్రి 9గంటల సమయంలో 9 నిమిషాలపాటు తమ సమయాన్ని ప్రతి ఒక్కరు కేటాయించాలని సూచించారు. జనతా కర్ఫ్యూ రోజు ప్రతి ఒక్కరు తమ కరతాళ ధ్వనులతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరు తమ ఇళ్లలోని లైట్లను ఆర్పివేసి . ఆపై వీధుల్లోకి రాకుండా తమ ఇంటి బాల్కని.. లేదా తలుపుల వద్ద కాని నిలబడి వీలైనన్ని దీపాలను వెలిగించాలి అని మోదీ కోరారు. అలా కాని పక్షంలో మీ మొబైల్‌ ఫ్లాష్‌ లైట్లను, లేదా ఎవైనా టార్చి లైట్లను వెలిగించాలి అన్నారు. దీని ద్వారా జాతి సంకల్ఫం ఒకటేనన్న సందేశాన్ని చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రపంచదేశాలు ఇండియాను అనుసరిస్తున్నాయని, దేశంలోని 130 కోట్ల మంది ఒకే పని చేస్తే ప్రపంచానికి ఓ సంకేతం వెలుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు ఏప్రిల్‌ 5 న రాత్రి 9 గంటలకు వీలైనన్ని ఎక్కువదీపాలు వెలిగించి మన సంకల్పాన్ని ప్రపంచానికి చెప్పాలన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/