రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది

minister-niranjan-reddy in wanaparthy
minister-niranjan-reddy in wanaparthy

వనపర్తి : రైతులు రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గోపాల్‌పేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సింగిల్‌విండో కార్యాలయ భవనం, దుకాణాల సముదాయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రసాయనిక ఎరువులు వాడడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు ప్రజలు అనారోగ్యం బారిన పడుతారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్ పి చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, డిసిసిబి చైర్మన్ వీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/