పదార్థాలను వృధా చేయొద్దు

కాయగూరలను తొక్కతీయకుండా వాడొచ్చు

Do not waste materials
Do not waste materials

వంట పూర్తయ్యేలోపు కిచెన్‌ పెద్ద చెత్తబుట్టలా తయారవుతుంది. ఆ చెత్తలో మనకు పనికొచ్చేవి కలిసిపోతాయి.

ప్రపంచంలో 80 కోట్ల మంది ఆహారం లేక విలవిల్లాడుతుంటే మనం మాత్రం కమ్మగా వండుకోదగిన పదార్థాల్ని కూడా వ్యర్ధాల్లా పడేస్తున్నాం.

ఈ వంటింటివి వృధాను అరికట్టడానికి పుట్టుకొచ్చిందే జీరో వేస్ట్‌ కుకింగ్‌ ఉద్యమం. కాలిఫ్లవర్‌ పువ్వును తీసుకుని వండుతాం. దాని కింది కాడలను మాత్రం పడేస్తాం.

అలా కాకుండా కాండలను కూడా కూరచేసుకోవచ్చు. నిమ్మరసాన్ని తీసిన తరువాత తొక్కల్ని పచ్చడికి వాడుకోవచ్చు.

నిమ్మ, దానిమ్మ తొక్కల్ని చెత్తబుట్టలో వేయకుండా వాటిని నీళ్లలో వేసి కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసి ఉడికించి, వడకట్టి తాగితే ఎన్నో పోషక విలువలు అందుతాయని ఆహార నిపుణులు చెప్పుతున్నారు.

ఆలు, కాకరకాయ, బీరకాయ, ఇలా ప్రతి ఆన్ని పై తొక్క తీయకుండా వండితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

చెక్కుతీసినా దాంతో పచ్చడి చేసుకోవచ్చు. దీనివల్ల నూటికి నూరుశాతం వాడుకున్నట్లు ఉంటుంది.

గుమ్మడికాయ గింజలు లాంటివాటిని పడేయకుండా, ఎండబెట్టి వేయించుకుంటే సాయంత్రం స్నాక్స్‌లా పనికొస్తాయి. యాపిల్‌ తొక్కల్ని టీ నీళ్లలో మరిగిస్తే టీ ఘుమఘుమలాడుతుంది.

ఆలూ తొక్కల్ని ఎండబెట్టి వేయిస్తే చిప్స్‌లా కరకరలాడతాయి.

పచ్చని ఆకుకూరల కాడల్ని పడేయకుండా వాటిని ముక్కలు చేసి కూరలా వండుకోవచ్చు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/