అర్థం కావు

ఆధాత్మిక చింతన

SHIRDI SAI
SHIRDI SAI

సాయిబాబా మాటలు ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా అర్థం కావు, సాయిబాబా మాటలే కావు, కొందరు మహా కవుల, పండితుల రచనలు అంతే. ఉదాహరణకు శ్రీహర్షుడు.

సరస్వతీ కటాక్షం కోసం శ్రీహర్షుని తల్లి శ్రీహరునికి చింతామణీ మంత్రోపదేశం చేసింది. ఆమె తన భర్తవద్ద నుండి ఆ మంత్రాన్ని పొందింది. శ్రీహర్షుడు మంత్రజపం చేస్తూనే ఉన్నాడు.

ఆమంత్ర సిద్దివల్ల అఖండమయిన పాండిత్వం లభించింది.

శ్రీహర్షుని తండ్రి పండతుడు కాకపోవటం వలన రాజాశ్రయం లభించ లేదు. శ్రీహర్షుని తండ్రి చినపోతూ పాండిత్యాన్ని లోకకళ్యాణం కోసం, దైవకార్యం కోసం ఉపయోగింపుమని హెచ్చరించాడు.

రాజస్థాన్‌ ఆస్థానం లోచోటు లభించటం కష్టం, శ్రీహర్షుని జీవితంలో తేలింది.

ఒకసారి శ్రీహర్షుడు కాశ్మీరదేశానికి వెళ్లాడు. స్రవంతీ తీరాన ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇంతల ఇద్దరు కాశ్మీరు మహిళలు ఆ నదీతీరానికి చేరారు.

వారిలో వారు కలహించుకోసాగారు. శ్రీహర్షుడూరి భాషను అర్థం చేసుకోలేకపోయాడు.

ఆ కాశ్మీరీభాష ఆయనకురాదు. వారి పోట్లాటలో జోక్యం కలుగుచేసుకో లేదు. ఇంతలో ఒకరాజు భటుడు వచ్చాడు. ఆ రాజభటుడు ఆ మహిళల నిర్దరిని రాజు వద్దకు తీసుకుపోయాడు.

‘ఎవరైనా సాక్షి ఉన్నారా?’ అని రాజు ఆ మహిళలను ప్రశ్నించాడు. నదీ తీరాన ఒక వ్యక్తి ఉన్నాడు అన్నాడు వారు. ఆ రాజభటు డు నదీ తీరానికి వెళ్లాడు.

ఆ వ్యక్తి అక్కడనే ఉన్నాడు. సైనికుడు రాజాస్థానికి తీసుకుపోయాడు. రాజు శ్రీహర్షుని ఆ ఇద్దరు స్త్రీలు దేనిని గూర్చి కలహించుకుంటున్నా అని ప్రశ్నించాడు.

నాకు కాశ్మీరీభాషరాదు. కాని ధ్వని రూపంలో ఉన్న సంభాషణలను యధాతధంచిప్పగలను అని చెప్పాడు రాజుకు. రాజు నీ పేరేమి అని అడిగాడు. హర్షుడు అని చెప్పాడు శ్రీహర్షుడు.

రాజు ఆ మహిళలకు తీర్పు చెప్పాడు. సరస్వతీ పుత్రుడయిన శ్రీహర్షుని గౌరవించాడు. అభిమానలతో ఆదరించాడు.

సర్వకళానిధి అనే బిరుదును ప్రసాదించాడు. సర్వకళానిధి అనే బిరుదును ప్రసాధించాడురాజు.

సర్వకళానిధి అనే బిరుదు ఎవరికో దక్షక్కడం, ఆ స్థానంలోని పండితులకు, విశేషించి మహారాణికి కంటగింపుగా ఉన్నది.

ఆ మహారాణికి కాశ్మీరీ పండితులు విదుషీమణి, అనే బిరుదు ఇచ్చాడు. ‘విదుషీమణి అనే బిరుదు సర్వకళానిధి అనే బిరుదుతో పోలుస్తే, ఆమెకే పేలవంగా ఉన్నదని పించింది.

మహారాణి, పండితులతో పథకంవేసింది. ఒకనాడు మహారాణి, తన పథకం ప్రకారం హర్షుని తన అంతంపురంలోనికి రమ్మని కబురు పంపింది. హర్షుడు వచ్చాడు.

ఆయనవచ్చే సమాయాన పరిచారిక మహారాణీ కాలికి అందెను తడుగుతోంది. అందెఎంతసేపటికి ఎక్కడం లేదు. అన్ని కళ లోను సిద్దు డయిన హర్షుడు.

ఈ అందెను వారిచేతితో తాకకుండా నా కాలుకు తొడుగుతారు చూడు అన్నది పరిచారికతో హర్షుడు వినేటట్లు హర్షునకు ఇదంతా ఒక కుట్రప్రకారం జరుగుతోందని గృహిం చాడు.

అందెను తీసుకుని, రాణికాలుకు తోడగటం చేయ లేనిపని. శ్రీహర్షుడు సరస్వతిని ప్రార్థించాడు. అందె సునాయా సంగారాణి కాలుకు ఎక్కింది.

రాణికాలును తాకకుండా అందెన ఎక్కించానన్నా, రాజు, ప్రజలు నమ్మరు.

రాజస్థానంలో తనను పంపివేయటానికే ఈ పన్నాగమని హర్షుడు గ్రహించాడు. వెంటనే కాశ్మీరు వదలి వెళ్లిపోయాడు.

ఆయన రచించిన శృంగారనైషధం పండితులకు, విద్వాంసులకే ఔషధం కందము చెప్పినవాడే కని, పందిని చంపిన వాడు బంటు, శృంగార నైషధమును అర్థం చేసుకున్నవాడే మహామహా పండితోత్తముడు.

  • యం.పి.సాయినాథ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/