అయోధ్య తీర్పుపై ఎలాంటి పోస్టులు చేయొద్దు

అయోధ్య జిల్లా కలెక్టర్‌

ayodhya
ayodhya

లక్నో: ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద అత్యంత కీలకమైన మూడు కేసుల ఉన్నాయి. అయోధ్య భూవివాదంతో పాటు వేల కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలను ఎదుర్కొన్న రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన మూడు కేసులపై రంజన్‌ గగో§్‌ు తీర్పును వెలువరించాల్సి ఉంది. పని దినాలు ఎనిమిది రోజులు కావడంతో ఈ వారాంతం నుంచి ఒక్కో కేసు తీర్పును వెలువరిస్తూ వస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగో§్‌ు పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో దశాబ్దాల నుండి న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తున్న చారిత్రాత్మక అయోధ్య భూవివాదంపై తీర్పును వెలువరించే అవకాశం ఉంది. 17 తేదీ లోగా సుప్రీంకోర్టు పనిదినాలు కూడా ఎక్కువగా లేవు. అత్యంత సున్నితం, సమస్యాత్మకమైనదిగా భావిస్తున్న రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/