గమ్యాన్ని మరువరాదు

ఆధ్యాత్మిక చింతన

Lord Sri Rama
Lord Sri Rama

గమ్యాన్ని దర్శించాలన్న తలంపుతో మనం ఏకాంతంగా ఒక మారుమూల గదిలో కళ్లు మూసుకొని మౌనంగా కూర్చొంటాం. వెంటనే మనం మన శత్రువులను తిట్టిన తిట్లు, వారు మనల్ని తిట్టిన తిట్లు కనపడతాయి. మన మనస్సుపై అవి తీవ్రమైన ముద్రవేసి ఉంటాయి. మనం కొంచం జాగ్రత్త పడి ఛీ, చీ ధ్యాన సమయంలో అవెందుకు అని వాటిని ప్రక్కన పెట్టి ముందుకు పోతాం.

అప్పుడు మన మిత్రులు, బంధువులు మనల్ని గూర్చి చెప్పిన మంచి మాటలు గుర్తుకొస్తాయి. మనసుకు హాలు వాటిని వదిలించుకొని ముందుకు పోతాం. మనం చదివిన సద్గ్రంధంలోని విషయాలు గుర్తుకొస్తాయి. అబ్బ! ఏదో సాధించబోతున్నాం అని అనిపిస్తుంది. ఆ విషయాలను మరీ మరీ నెమరువేస్తూ కాం గడుపుతాం వెంటనే మరీ జాగ్రత్త పడి ఇంకా ముందుకు పోతాం.

వాటిని తమన మార్గం నుంచి తీసేసి. అక్కడ మహాత్ములు, మహర్షులు, గురువు లు, సాధువులు, సన్యాసలు ఎందరెందరో ఎదురౌతారు. మనం అనుసరించవ లసిన మార్గాన్ని గూర్చి, పద్ధతులను గూర్చి బోధిం చటం మొదలుపెడతారు. ఒకరిని వదిలించుకొని ముందుకు పోవటమే మనకు ఎంతో కష్టమవుతుంది.

ఎందుకంటే వారు సూచించే సూచనలు, మాటలు, దృక్కులు, వారి ప్రేమ మనల్ని కట్టి పడేస్తాయి. అలాంటివారు మన మార్గంలో ఒకరి తర్వాత మరొక్కరు దరశనమిస్తూనే ఉంటారు. వారి నుంచి అతి కష్టం మీద విడిపడాల్సి ఉంటుంది.

లేకపోతే అక్కడే దశాబ్దాలు గడిచి పోతాయి. సరే, జాత్రత్తగా వారికి వీడ్కోలు పలికి ముందుకు వెళితే ఇక మనకు ఎంతో ఇష్టమైన దేవీ, దేవతలు దేదీప్యమానంగా వెలిగి పోతూ, మన కోరికలను తీరుస్తూ, కొన్ని సిద్ధులను మనకు ప్రసాదిస్తూ మనల్ని ముదుకు కదలనీయక, మన గమ్యాన్ని మరచి పోయేట్టు చేస్తారు.

ఇక ఎన్ని జన్మలు, యుగాలు గడచిపోతాయో మళ్లీ మనం మేల్కోవటానికి అందుకే మనకు దర్శనమిచ్చే ఆ శ్రీరామునకు, శ్రీ కృష్ణునకు, లక్ష్మీదేవికి, కాళికాదేవికి సవినయంగా దండం పెట్టి దయచేసి నామార్గం నుంచి మీరు పక్కకు తప్పుకోండి. నన్ను నా లక్ష్య వైపు సాగనివ్వండి అని ప్రార్థించాలి.

అయినా వారు కనికరించరు. నీ మేలు కోరి, నీ మీద దయదలచి, నీకు సకలసౌకర్యాలు కలుగచేయటానికే మేమున్నాం, నీ వెంటే ఉంటాం, నీవు పిలుస్తే పలుకతాం అని వారు అంటారు. మనల్ని అంటి పెట్టుకొనివారు, వారిని అంటిపెట్టుకొని మనమై ఉంటాం.

నిరంతరం మన ముందేవారు అడ్డంగా నిలబడి లక్ష్యం కనపడకుండా చేస్తారు. మనం అదంతా మాయ,భ్రమ, ఇంద్రజాలం అని తెలుసుకొని, వారితో తెగతెంపులు చేసుకొని పురోగమిస్తే లక్ష్యాన్ని చేరుకోగలం. కాళీకాదేవిని తప్పించుకొని ముందుకు పోలేక, శ్రీరామకృష్ణ పరమహంస
ఎన్ని అగచాట్లు పడ్డాడో ఆయన చరిత్ర చెబుతుంది.

గౌతమ బుద్ధుడు, నేను మీకు ధ్యానంలో అడ్డువస్తే నిర్దాక్షిణ్యంగా నన్ను అడ్డంగా నరికి ముందుకు పోండి అని హెచ్చరించాడు. ఆయన ఎంత కరుణామయుడో..

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/