తింటూనే నీరు తాగకూడదు

ఆరోగ్యం-అలవాట్లు

drinking water
drinking water

చాలావరకు మనదాంట్లో భోజనం చేసేటప్పుడు కొందరు అసలు మాట్లాడరు. కొందరు మాత్రం మాట్లాడుతూనే భోజనం చేస్తుంటారు.

అలాకాకుండా భోజనం చేసేటపుదు మాట్లాడకుండా చేయటం మంచిది. అన్నం తినేప్పుడు కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. కొంతమంది శీతల పానీయాలతో పాటు భోజనం చేయడం అలవాటు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం.

ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంలో చాలామంది అన్నంతోపాటు ఇతరత్రా పదార్థాలను, పానీయాలను కలిపి తీసుకుంటు ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం.

అన్నంతోపాటుగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. అన్నం తినేటప్పుడు పండ్లు తినడం వల్ల వాటిలో ఉండే పోషకాలు శరీరానికి పూర్తిగా అందవు. భోజనం చేసిన గంట తర్వాత పండ్లను తినడం ఉత్తమం.

కనీసం అరగంట విరామం ఇచ్చినా పర్వాలేదు. ప్రతిఒక్కరూ సీజన్లో లభించే ప్రతి పండును తినాలి.

రాత్రిపూట ఆకలి ఎక్కువయితే చిల్లర తిండికి బదులు పండ్లను తినడమే ఉత్తమం. చాలా మందికి నీళ్లు తాగితే గానీముద్ద దిగదు.

అన్నం తింటున్నంత సేపు నీళ్లు తాగేస్తూ కడుపు నింపేసుకుంటారు. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. కాబట్టి భోజనం ముగిసిన అరగంట వరకూ మంచినీళ్లు తాగొద్దు.

ముద్ద దిగడం కష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక గుటక నీళ్లు తాగాలి. అప్పుడే మీరు తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.

మరికొందరికి భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది.

దీనివల్ల ఆహారంలోని పోషకాలు పూర్తిస్థాయిలో శరీరానికి అందవు.

టీలో ఉంటే టానిన్లు ఆహారంలోని ఐరన్‌, ప్రొటీన్లతో కలవడం వల్ల ముఖ్యమైన పోషకాలను శరీరం గ్రహించలేదు. భోజనం చేసినా ఫలితం ఉండదు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/