ఇళ్ల నుంచి బయటకు రావద్దు!

జీహెచ్ ఎంసీ హెచ్చరికలు జారీ

Heavy Rain
Heavy Rain

Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్ లో నిన్న అంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి విశ్వనగరం కాస్తా విశ్వనరకంగా మారిపోయింది. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి.

లోతట్లు  ప్రాంతాలు ముంపు ముప్పులో చిక్కుకున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కేరిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జీహెచ్ ఎంసీ అప్రమత్తమైంది.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. నేడూ, రేపు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకూ సెలవు ప్రకటించింది.

అత్యవసర సేవలకు, విభాగాలకు ఈ సెలవు నుంచి మినహాయింపు ఇచ్చింది.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/