మందు పంపిణీ లేదు: పుకార్లు నమ్మొద్దు

వీడియో సందేశంలో ఆనందయ్య క్లారిటీ

Nellore District: తాజాగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ జరుగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆనందయ్య శుక్రవారం వీడియో లో స్పందించారు. తాను శుక్ర‌వారం నుంచి మందు పంపిణీ చేస్తునట్టు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పుకార్లు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయన కోరారు. . ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రాగానే తిరిగి పంపిణీ చేస్తామ‌ని.. ఆ విష‌యాన్ని మీడియా ద్వారా ప్రకటన చేస్తానని తెలిపారు. అప్ప‌టివ‌ర‌కు ఎటువంటి వాట్సాప్ మెసేజ్ లు న‌మ్మ‌వ‌ద్ద‌ని అన్నారు. . ప్ర‌స్తుతానికి త‌న వద్ద ఎటువంటి ఔష‌ధ త‌యారికి సంబంధించి ద్ర‌వ్యాలు లేవని ఆయన తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/