సిఫారసు లేఖలను స్వీకరించవద్దు

tirumala
tirumala

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని నిత్యం లక్షల మందికి పైగా దర్శించుకుంటారు. అయితే రాజకీయాలతో ముడిపడి ఉన్న ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను స్వీకరించవద్దని ఎన్నికల సంఘం తితిదేను ఆదేశించింది. ఈ మేరకు తితిదేకు ఓ లేఖ పంపింది. సిఫారసు లేఖల స్వీకరణకు మంగళం పలకడంతో అదనంగా నిత్యం పది వేల మందికిపైగా సామాన్యులకు తిరుమల శ్రీవారి దర్శనం లభిస్తోంది. తితిదే ధర్మకర్తల మండలిలోని రాజకీయాలతో సంబంధం లేని నలుగురికి తప్ప ఇతరుల సిఫారసు లేఖలకు టిక్కెట్లు జారీ చేయవద్దనే ఆదేశాలు అందాయి. రద్దీ ఎక్కువగా ఉండే వేసవి సెలవుల్లో వెలువడిన ఈ నిర్ణయం సామాన్యులకు వరంగా మారింది.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/