తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

మృతదేహాలకు కూడా కరోనా టెస్టులు చేయాలని ఆదేశం

telangana high court
telangana high court

హైదరాబాద్‌: తెలంగాణలో చనిపోయిన వారికి కూడా కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చనిపోయిన వారికి పరీక్షలు చేయకపోతే… కరోనా 3వ స్టేజికి వెళ్లే ప్రమాదం ఉందని పిటిషనర్ వాదించారు. వివిధ సంస్థలు ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించాలని వాదించారు. దీంతో మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కేంద్రం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో నివేదించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 26 వరకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఈ నెల 26న నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/