రజినీకాంత్‌కు డీఎంకే అధినేత స్టాలిన్‌ సూచన

పెరియార్‌ లాంటి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నా

M. K. Stalin
M. K. Stalin

చెన్నై: ద్రావిడ పితామహుడు, సంఘ సంస్కర్త పెరియార్‌ ఈవీ రామస్వామిని ఉద్దేశించి కొలివుడ్‌ సుపర్‌స్టార్‌ ఆల్‌ ఇండియా సుపరిచితుడు రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలపై డిఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ స్పందించారు. పెరియార్‌ లాంటి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలంటూ రజినీకాంత్‌కు స్టాలిన్‌ హితవు పలికారు. నా స్నేహితుడు రజినీకాంత్‌ రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఓ నటుడు పెరియార్‌ లాంటి వారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నాను అని స్టాలిన్‌ తెలిపారు. కాగా ఇటీవల తుగ్లక్‌ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో రజినీకాంత్‌ మాట్లాడుతూ పెరియార్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 1971లో పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగిస్తున్నారని ఆయన అన్నారు. దీంతో పెరియార్‌ గురించి రజినీకాంత్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ (డీవీకే) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/