రాహుల్‌ రాజీనామాపై స్టాలిన్‌ ఫోన్‌

Rahul Gandhi, M.K. Stalin
Rahul Gandhi, M.K. Stalin

చెన్నై: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సార్వత్రక ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పలువురు నేతలు అలాంటి నిర్ణయం తీసుకోవద్దని రాహుల్‌కు సూచిస్తున్నారు. ఈ సందర్భంగానే తాజాగా తమిళనాడుకు చెందిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ రాహుల్‌కు ఫోన్‌ చేశారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయనకు సూచించారు. ఈ అంశంపై సోనియాతోనూ స్టాలిన్‌ మాట్లాడారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్‌ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో డీంఎకే కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/