డిఎల్‌ఎఫ్‌, ఎఫ్‌సిఎల్‌ పైపైకి

DLF
DLF

ముంబై, : ఒకే బ్లాక్‌డీల్‌ ద్వారా డిఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ ఈక్విటీలో 3.5శాతం వాటాకు సమానమైన 6.81కోట్ల షేర్లు చేతులు మారినట్లు ఎన్‌ఎస్‌ఇ డేటా వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 5 శాతం క్షీణించి రూ.192దిగువన ట్రేడవుతోంది. ఫ్యూచర్‌ కన్జూమర్‌ షేరు ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల జారీ ద్వారా రూ.350కోట్లను సమీకరించేందుకు ఫ్యూచర్‌ కన్జూమర్‌ తాజాగా ప్రణాళికలు వెల్లడించింది. ఈ నిధుల సమీకరణలో భాగంగా కంపెనీలో ప్రస్తుతం ఇన్వెస్టర్‌గా కొనసాగుతున్న ఐఎఫ్‌సితో పాటు వెర్లిన్‌వెస్ట్‌కూ సెక్యూరిటీలను జారీచేయనున్నట్లు తెలియచేసింది. ఇదేవిధంగా కంపెనీ ప్రమోటర్లు కూడా సెక్యూరిటీల కొనుగోలు ద్వారా నిధుల సమీకరణకు సహకరించనున్నట్లు వివరించింది. నిధులను ప్రధానంగా బిజినెస్‌ విస్తరణ ప్రణాళికలకు వెచ్చించనున్నట్లు వివరించింది. బ్యాలన్స్‌షీట్‌ను కూడా పటిష్టం చేసుకోనున్నట్లు తెలియచేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫ్యూచర్‌ కన్జూమర్‌ షేరు ఎన్‌ఎస్‌ఇలో 2 శాతం పెరిగి రూ.54.5వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 45.71శాతం వాటా ఉంది.

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/business/