మనీలాండరింగ్ కేసు..ఈడీ ఎదుట హాజరైన డీకే శివకుమార్

DK Shivakumar
DK Shivakumar

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోరడంతో ఆయన ఢిల్లీ చేరుకున్నారు. డీకే శివకుమార్ తో పాటు ఆయన తమ్ముడు సురేష్ కూడా విచారణకు హాజరయ్యారు. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు తాను భారత్ జోడో యాత్రను మధ్యలోనే వదిలేసి వచ్చానని ఆయన చెప్పారు. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు డీకే బ్రదర్స్ ఇచ్చిన విరాళాలకు సంబంధించి ఈడీ వీరిని విచారిస్తోంది.

కర్ణాటకలో రాహుల్ గాంధీ జోడో యాత్ర జరుగుతున్న టైమ్ లో ఈడీ నోటీసులు పంపిచడంతో విచారణకు తాను హాజరుకావడానికి సమయం ఇవ్వాలని కోరినప్పటికి ఈడీ అధికారులు పట్టించుకోవడం లేదని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా సెప్టెంబర్ 19న డీకే శివకుమార్‌ను ఈడీ అధికారులు దాదాపుగా 5 గంటలకు పైగా ప్రశ్నించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/