తెలంగాణ బిజెపి పగ్గాలు డికె అరుణకు?

D. K. Aruna
D. K. Aruna

హైదరాబాద్‌: తెలంగాణ బిజెపి అధ్యక్షురాలిగా డికె అరుణను ఎంపిక చేయనున్నారనన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా వార్తలకు కారణం బిజెపి సీనియర్‌ నేత మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలు మరింత ఊతం పెంచాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికైనా బిజెపి అధ్యక్షులు కావొచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆయన డికె అరుణను దృష్టిలో పెట్టుకునే మురళీధర్‌రావు ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. దీంతో తెలంగాణ బిజెపి కొత్త అధ్యక్ష్య పదవి అరుణకు దక్కే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు అధిష్టానం నుంచి కూడా అరుణకు ఇప్పటికే హామీ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టిఆర్‌ఎస్‌ను ఆమె అయితేనే దూకుడుగా ఎదుర్కోగలదన్న భావన అధిష్టానం దృష్టిలో ఉందని కొందరు చెబుతున్నారు. కాగా మరోవైపు ఈ పదవి కోసం ఢిల్లీ స్థాయిలో కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/