దీపావళి..భారీ శబ్ధాలు చేసే బాణాసంచా నిషేధం

hyderabad cp anjani kimar
hyderabad cp anjani kimar

హైదరాబాద్‌: దీపావళి నేపథ్యంలో జంటనగరాల్లో భారీ శబ్ధాలుచేసే బాణాసంచా కాల్చడం పై నిషేధం విధించినట్టు హైదరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ అంజనీకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలో శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈనెల 12వ తేదీ ఉదయం 6గంటల నుంచి 16వ తేదీ వరకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. దీపావళి రోజున రాత్రి 8గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే బాణాసంచా అనుమతిస్తామని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిర్ధేశించిన పరిమాణంలోనే శబ్ధం వచ్చే క్రాకర్స్‌ మాత్రమే కాల్చాలని అన్నారు. మెయన్‌రోడ్లు, పబ్లిక్‌ ఏరియాల్లో బాణాసంచా కాల్చడాన్ని కూడా నిషేధించినట్టు ఆయన తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై హైదరాబాద్‌పోలీస్‌యాక్ట్‌, 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/