దీపావళి కానుకగా టైటిల్ క్లారిటీ

Balakrishna

దీపావళి కానుకగా నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రానికి సంబంధించిన కీలక ప్రకటన చేసి నందమూరి అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాడు. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రూలర్ తో పాటు ఇంకా పలు టైటిల్స్ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం టైటిల్ విషయమై దీపావళికి క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈనెల 26న బాలకృష్ణ 105వ చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రివీల్ చేసి మోషన్ పోస్టర్ ను దీపావళి కానుకగా నందమూరి ఫ్యాన్స్ కు ట్రీట్ గా ఇవ్వబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/