కార్మికులకు సిఎం కేజ్రివాల్‌ దీపావళి గిఫ్ట్‌

కార్మికులు కనీస వేతనాల పెంపు

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశ రాజధానిలోని 55 లక్షల మంది కార్మికులకు కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్టు ప్రకటించారు. అలాగే, ఉద్యోగులు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ డీఏతో పాటు, ఒక నెల జీతం బోనస్‌ను కూడా అందుకోనున్నట్టు ప్రకటించారు. కనీస వేతనాల పెంపుపై ఆప్ సర్కర్ తాజా ప్రకటనతో కార్మికల కనీస వేతనాలు భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రకారం నిపుణ కార్మికుల కనీస వేతనం రూ.10,478 నుంచి రూ.17,999కి పెరిగింది. పరిమిత నైపుణ్యం కలిగిన (అన్‌స్కిల్డ్) కార్మికుల వేతనం రూ.9,542 నుంచి రూ.16,341కి, నైపుణ్యం లేని కార్మికుల (అన్‌స్కిల్డ్) వేతనం రూ.8,632 నుంచి రూ.14,842కు పెరిగింది.

దీనిపై కేజ్రీవాల్ మీడియాతో సోమవారంనాడు మాట్లాడుతూ, కనీస వేతనాల తాజా పెంపుతో దేశంలోనే ఢిల్లీలో అత్యధిక వేతనాల అందిస్తున్నట్టు అయిందన్నారు. ఇది జాతీయ కనీస వేతనాలకు మూడు రెట్లని చెప్పారు. పేదరికం, ఆర్థిక మాంద్యాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/