వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు

diwali celebration
diwali celebration

వాషింగ్టన్‌: అమెరికాలో నివాసముంటున్న హిందువులకు, జైన్లకు, సిక్కులకు, బౌద్ధమతస్తులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ రోజున అమెరికా విద్యుద్దీపాలతో అలంకరించబడుతుందని ట్రంప్‌ గుర్తు చేశారు. అమెరికాలో మత స్వేచ్ఛ చాలా ఉందని చెప్పేందుకు దీపావళి పండుగే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఓవల్‌ కార్యాలయంలో ఒకరోజు ముందే ట్రంప్‌ ఇండో అమెరికన్లతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. అమెరికా రాజ్యాంగంలో ఉన్నట్లుగానే ఇక్కడి ప్రజలు తమ ఇష్టదైవాలకు పూజలు, ప్రార్ధనలు జరుపుకోవచ్చని, ఫలానా మతాన్ని స్వీకరించమని బలవంతం చేయమని ఆయన అన్నారు. దీపావళి సందర్భంగా తను తన భార్య మెలీనియా తరపున శుభాకాంక్షలు చెబుతున్నట్లు ట్రంప్‌ చెప్పారు. దీపావళి పండుగ అంటే చీకటిపై వెలుగు గెలవాలని, చెడుపై మంచి విజయం సాధించాలని, అజానం తొలిగిపోయి జ్ఞానం నిండాలని ట్రంప్‌ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు ఈ పండుగ సమయంలో పూజలు నిర్వహిస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/