తాను టీడీపీలోనే కొనసాగుతానని దివ్యవాణి క్లారిటీ

తాను టీడీపీ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ లో దివ్యవాణి పోస్ట్ చేయడం తో అంత షాక్ అయ్యారు. దివ్యవాణి రాజీనామా చేయడం ఏంటి అని అంత మాట్లాడుకున్నారు. అయితే ఆమె పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేసి క్లారిటీ ఇచ్చింది. తాను టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీని వీడేది లేదని దివ్యవాణి క్లారిటీ ఇచ్చింది. తన రాజీనామా వార్తల్లో నిజం లేదని , మీడియాకు ఓ వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి దివ్యవాణిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఓ ప్రెస్ నోట్‌ను వైరల్ చేశారు. ఇది చూసి నిజమనుకుని పార్టీకి రాజీనామా ప్రకటించానని ఆమె చెబుతున్నారట. పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత ట్వీట్ డిలీట్ చేశారట. మహానాడులో మాట్లాడే అవకాశం రాకపోవడంపై దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం వాస్తవమే కానీ ఆమె రాజీనామాపై మాత్రం గందరగోళం నెలకొంది. దివ్యవాణిని తాము సస్పెండ్ చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది. గతంలోనూ కొందరు తప్పుడు పోస్ట్‌లు పెట్టారని, గతంలో అయ్యన్నను సస్పెండ్ చేసినట్లు ఫేక్‌ పోస్ట్‌లు పెట్టారని టీడీపీ గుర్తుచేసింది. బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత దివ్యవాణి తన రాజీనామాపై వెనక్కి తగ్గి ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలిసింది. అయితే.. పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని మాత్రం దివ్యవాణి స్పష్టం చేశారు.