నరుడు – వానరుడు

షిర్డీసాయినాథుని దివ్య లీలలు

Shirdi-Sai-Baba
Shirdi-Sai-Baba

భోలానంద్‌ మహారాజ్‌, సాయిబాబా సమకాలికులు ఒక కధనం ప్రకారం సాయిబాబాను బాల్యంలోనే మహమ్మదీయు లకు ఇచ్చినట్లు తెలుస్తుంది.

భోలానాథ్‌ తనంతటతానే ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. అలా ఇంట్లోంచి వెళ్లిపోయినది ఈతడు ఆ కుటుంబంలో రెండవవాడు. మొదటి వ్కక్తి తన అన్న. ప్రపంచలపై విరక్తి కలిగి, ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈతడు (భోలానంద మహారాజ్‌) రెండవ వాడు. అంతేకాదు. ఇతని తరువాత జన్మించిన, తమ్ముడు కూడా సన్యాసం స్వీకరించటానికి ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు.

చివరకు ఒకే ఒక తమ్ముడు పుట్టాడు. అతడే తల్లి దండ్రులను చూచుకునేవాడు. ఆయన అమ్మకు కల్గిన 4 బిడ్డలలో ముగ్గురు ఆధ్యాత్మిక పథంవైపు వెళ్లిపోయినారు.

భోలానందజీ గురువుపేరు గులాబ్‌గిరి మహారాజ్‌, గురువును కంటికి రెప్పలాగా చూచుకునేవాడు భోలానంద్‌.

ఒకనాడు గురువుకు ఎందుకో కోపం వచ్చింది. ‘ఇకనీవు ఈ ఆశ్రమంలో ఉండవద్దు. తుండుగుడ్డలో వెళ్లిపో అని గద్దించాడు.

భోలానంద్‌ గురువును తాను చేసిన తప్పు ఏమిటి అనిగాని, నేను అశ్రమం నుండి ఎందుకు పోవాలి అనిగాని ప్రశ్నించలేదు.

వెంటనే బట్టలను తీసివేశాడు. తుండును కట్టు కున్నాడు. గురుపాదాలకు నమస్కరించి వెళ్లిపోయాడు. గురువు ఆశ్రమం తలుపులు మూసివేసుకున్నాడు. అదిశీతాకాలం. ఎముకలు కోరికే చలివేస్తోంది.

చింతించలేదు భోలానంద్‌. ఆశ్రమం ఎదురుగా ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు కిందనే, చలికి గజగజవణికుతూ రాత్రంతా గడిపాడు.

తెల్లవారింది. గురువు ఆశ్రమం తలుపులు తెరిచాడు. ఎదురుగా ఉన్న చెట్టు కింద భోలానందులురెండు చేతులలో నమస్కరిస్తూ కనబడ్డాడు. భోలానంద వద్దకు వెళ్లాడు.

‘ఆరతి సమయం అవుతోంది. పూజకు ఏర్పాట్లు చేయి అన్నాడు గురువు శిష్యునితో ప్రేమగా, గురువుకు నమస్కరించి ఆశ్రమంలో మరల ప్రవేశించాడాశిష్యుడు.

తమకుతోచిన విధంగా గురువులు పరీక్షలు పెడుతుంటారు. అలా గురువుల పరీక్షలో నెక్గితేనే, ఉన్నత స్థాయికి చేరగలిగేది. భోలానందుని ఆశ్రమంలోనికి కోతులు

ఇష్టంవచ్చిపప్పుడు వస్తాయి. ఆరవేసిన బట్టలను చింపేస్తాయి. ఆహార పదార్థాలను తినినంత తింటాయి. లేకపోతే, ఆ భూమిపై వెదజల్లుతాయి.

భోలానందుల ఆజ్ఞప్రకారం ఆ ఆశ్రమంలో ఏ జీవిని కసురుకోకూడదు. కొట్టకూడు. భక్తులు ఆశ్రమవాసులు ఆ కోతులకు ఏమీ చేయలేకపోతున్నాడు.

ఒకనాడు ఆ ఆశ్రమానికి ఒక పెద్ద కోతి వచ్చింది. భోలానందులు ఆ కోతితో ‘మీరు ఆశ్రమంలో ఫలాలను చక్కగా తినవచ్చు.

కానీ మాకు కష్టం, నష్టం కలిగించకూడదు అన్నారు. ఆ కోతి తనకు అర్థమైనదన్నట్లు తల ఊపింది. ఒక కోతుల బెడదలేదు ఆశ్రమవాసులకు. వానరులవలె నరులును ఇతర జీవులకు హాని కల్గింపకుండదుగా!

– యం.పి.సాయినాథ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/