రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లుగా జిల్లాల విభజన

జాబితాను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

red zone area
red zone area

హైదరాబాద్; తెలంగాణాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటిస్తూ కేంద్రం జాబితాను విడుదల చేసింది. ఇందులో రెడ్ జోన్ లుగా హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ అర్బన్, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా ఆరెంజ్ జోన్ లో 18 జిల్లాలు ఉన్నాయి ఇందులో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల , మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి , ఆదిలాబాద్, నల్గొండ, నిర్మల్, జోగులాంబ, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి మిగతా వాటిని గ్రీన్ జోన్ లు గా ప్రకటించింది. ఇందులో నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్ధిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి జిల్లాలు ఉన్నాయి ఆయా ప్రాంతాలలో పరిస్థితులను బట్టి అధికారులు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/news/international-news/