కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
minister errabelli dayakar rao

వరంగల్‌: పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రాయపర్తి మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో 126 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదింటి ఆడ బిడ్డల పెండ్లికి పెద్దన్నగా మారి సిఎం కెసిఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నాడని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు కట్నంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబార్ చెక్కులు అందించి పేదల కష్టాల్లో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌ నూతన ఆలోచనలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/