లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

హైదరాబాద్: నేడు వనపర్తిలోని తన నివాసంలో మంత్రి నిరంజన్ రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్‌ఎస్‌ సర్కారు అండగా నిలుస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

సంక్షేమ పథకాల అమలులో ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర కరంట్‌ సంక్షోభం ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపలేదు. ప్రణాళికాబద్ధంగా తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ శక్తులూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేవని మంత్రి స్పష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/