16 న రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి చేప పిల్లల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అన్ని జిల్లాల్లోను ఈ నెల 16 న చేప పిల్లలను విడుదల చేయాలని అధికారులకు లేఖలు పంపిన మంత్రి తలసాని. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చేప పిల్లలను విడుదల చేయనున్న తలసాని. రాష్ట్రం లో ఉన్న 24 వేల నీటి వనరులలో 80 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను కూడా విడుదల చేస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోటి చేప పిల్లలు, 26 లక్షల రొయ్య పిల్లలు విడుదల చేస్తామని అన్నారు. ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/