నేటి నుండి బతుకమ్మ చీరల పంపిణి

Bathukamma sarees
Bathukamma sarees

హైదరాబాద్‌: నేటి నుండి బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకానుందిఇందుకు సంబంధించిన అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. చీరల పంపిణీలో గత అనువాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా నల్గొండ పట్టణంలో ఉదయం 10.౩౦ గంటలకు రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా పంచాయతీ రాజ్ శాఖ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌లో జిల్లాలోని దేవరుప్పలలో తలపెట్టిన బతుకమ్మ చీరల పంపణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మిగిలిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యెలు , ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సైతం బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నారు. మొత్తం 1.02 కోట్ల చీరలను అర్హులైన ప్రతి మహిళలకు రాష్ట్రప్రభుత్వం అందజేయాలని లక్షంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ. ౩13 కోట్ల రూపాయలను వెచ్చించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/