ఒంటి గంట లోపు ఇళ్ల వద్దనే 100శాతం పెన్షన్ల పంపిణీ:గుంటూరు కలెక్టర్ శామ్యూల్

Guntur District Collector Samuel Anand kumar in Video Conference

Guntur: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సామాజిక భద్రత పింఛన్లను శనివారం మధ్యాహ్నం ఒంటి గంట లోపు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే 100శాతం పంపిణీ జరిగేలాచూడాలని జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూ ల్‌ ఆనంద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీకి అందించిన స్మార్ట్‌ఫోన్లను వలంటీర్లకు అందజేసి పర్యవేక్షిం చాలన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఆయన పెన్షన్లు, పేద లందరికి ఇళ్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. ఉగాది పండగ మార్చి 25న రాబోతోన్నదని, ఆ రోజున జిల్లాలో పేదలం దరికి నివేశన స్థలాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

సమ యం తక్కువగా ఉన్నందున రోజువారి షెడ్యూల్‌ రూపొందించుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో భూసమీకరణకు సంబంధించి ఆమోదించిన ఫారం-సీలను వార్డు సచివాలయాలు, పంచాయతీ ఆఫీ సుల్లో ప్రచురించాలన్నారు.

సమీకరించనున్న భూముల యజమానుల నుంచి ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవడంతో పాటు ఫారం-సీని గ్రామాల్లో ప్రచురించినట్లుగా వీఆర్‌ వోల నుంచి సర్టిఫికెట్లని ఆర్డీవోలు సేకరించాలన్నారు. శుక్రవారం వరకు ఆమోదించిన ఫారం-సీ స్థలాలకు సం బంధించి 6ఏ ప్రచురణని శనివారం అన్ని దినపత్రికల్లో తప్పనిసరిగా ప్రకటనలు వచ్చేలా ఆర్డీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌కు ఫారం-ఏ పంపిణీ స్థలా లకు ఏ2 జారీ చేయడం జరుగుతుందని, దీనికి ఫారం- సీ ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటికీ ఫారం-ఏ పంపనివారు వెంటనే కలెక్టరేట్‌కు పంపించా లన్నారు.

ఫారం-సీ పబ్లికేషన్‌ తేదీ నుంచి 15రోజుల త ర్వాత భూయజమానులతో తహసీల్దార్‌ సమావేశం అయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థలాల ధరలు నిర్ణ యించి వారితో అగ్రిమెంట్‌ అయి నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఫిబ్రవరి 3న ప్రజాప్రతినిధులుతహసీల్దారులతో ప్రత్యే క సమావేశం నిర్వహిస్తామన్నారు. 

అభ్యంతరం లేని స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించు కొన్నవారి స్థలాలు రెగ్యులైజేషన్‌ చేసేందుకు జారీచేసిన జీవో 460ప్రకారం ఆక్రమణదారులందరిని మీ-సేవ కేం ద్రాల్లో దరఖాస్తు చేసుకొనేలా వార్డు వలంటీర్లను మొబి లైజేషన్‌ చేయాలన్నారు. వీటినివెంటనే పరిశీలించి నిబం ధనల ప్రకారం ఆమోదించాలన్నారు.

దీనిపై గుంటూరు, మాచర్ల, నరసరావుపేట మునిసిపల్‌ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్ల క్లెయిమ్‌లు,అభ్య ంతరాలను ఫిబ్రవరి 3వ తేదీ నాటికి పరిష్కరించి ఆన్‌లై న్‌లో అప్‌లోడ్‌ చేయుయాలన్నారు.ఈ సమావేశంలో జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జేసీ-2 శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో సత్య నారాయణ, జడ్పీ సీఈవో చైతన్య,డీఆర్‌డీఏ పీడీ యుగ ంధర్‌ కుమార్‌, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/