డిస్నీ సంస్థ నుండి ఇలాంటి సమాధానం బాధాకరం

సమాధులపై మా సినిమా పోస్టర్లు వద్దు
డిస్నీ నిర్ణయంపై కొడుకుని కోల్పోయిన తండ్రి ఆవేదన

Jones, Ollie
Jones, Ollie

ఇంగ్లండ్‌: ఇంగ్లండ్‌కు చెందిన జోన్స్‌ అనే వ్యక్తికి నాలుగేళ్ల కోడుకు ఉన్నాడు. అతనిపేరు ఓల్లి. స్పైడర్‌మ్యాన్‌ అంటే ఓల్లీకి చాలా ఇష్టం. అయితే చిన్నప్పుడే ఓల్లీకి ల్యూకోడిస్ట్రోఫీ అనే వ్యాధి సోకింది. కాగా తన కుమారుడు చనిపోవడానికి ఒకరోజు ముందు జోన్స్‌.. స్పైడర్‌మ్యాన్‌ గెటప్‌ వేయించి ఓ వ్యక్తిని పిలిపించారు. అతన్ని చూసి నిజంగానే స్పైడర్‌మ్యాన్‌ వచ్చాడని ఓల్లీ ఎంతో సంతోషించాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. చికిత్సపొందుతూ ఓల్లీ చనిపోయాడు. ఈ సందర్భంగా ఓల్లీ సమాధిపై స్పైడర్‌మ్యాన్‌ పోస్టర్‌ అంటించాలని జోన్స్‌ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం డిస్నీ సంస్థను నుంచి అనుమతి తీసుకోవాలనుకున్నారు. అయితే డిస్నీ నుంచి ఊహించని సమాధానం రావడంతో జోన్స్‌ షాకయ్యారు. ఖఓల్లీ సంతోషంగా ఉండటానికి మా స్పైడర్‌మ్యాన్‌ హస్తం కూడా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఓల్లీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. తరతరాలుగా మా డిస్నీ సంస్థ నుంచి వస్తున్న సినిమాలను ఎందరో ఆదరిస్తున్నారు. ఈ సూపర్‌హీరోల పాత్రలు నిజంగా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నవారూ ఉన్నారు. అయితే సమాధులపై, స్తూపాలపై మా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను అంటించడానికి డిస్నీ సంస్థ నిబంధనలు ఒప్పకోవుగ అని పేర్కొంది.నిపై జోన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిస్నీ సంస్థ నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని నేను ఊహించలేదు. చిన్నారి కోసమైనా వారు నా విన్నపాన్ని ఒప్పుకొంటారని అనుకున్నాను. ఇది నిజంగా బాధాకరం అంటూ జోన్స్‌ విలపించారు .


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/