దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకం

Manda Krishna Madiga
Manda Krishna Madiga

నిజామాబాద్‌: దేశంలో సంచలనం సృష్టించి దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ అని మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థ కళ్లుకప్పే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని ఆయన విమర్శించారు. దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం జరగాలని, తద్వారా వాస్తవం వెల్లడవుతుందని అన్నారు. తమ చర్య బయటపడుతుందనే ప్రభుత్వం రీపోస్టుమార్టంకు అంగీకరించడంలేదని ఆయన దుయ్యబట్టారు. అగ్రకులాల మహిళలకు ఓ న్యాయం? పేద దళితులకు ఓక న్యాయమా? అని మందకృష్ణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వేసిన త్రిసభ్య కమిటీని స్వాగతిస్తున్నామని, న్యాయవ్యవస్థ కళ్లుగప్పి చేసిన దారుణ హత్యలే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ అని మందకృష్ణ అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/