కెరీర్ పైనే శ్రద్ధ

Disha-Patani

ట్రెండ్స్ ని ఫాలో అవ్వడంలో లోఫర్ బ్యూటీ దిశా పటానీని కొట్టేవాళ్లే లేరు. నవతరం నాయికల్లో ఈ అమ్మడి స్టైల్ ప్రతిసారీ హాట్ టాపిక్. నిరంతరం ఏదో ఒక వేడెక్కించే వ్యవహారంతో యూత్ కి టచ్ లో ఉంటుంది. సీకే బ్రాండ్ కి ప్రమోషన్ చేసినా .. ఎక్సర్ సైజులు చేస్తూ ఫిట్ నెస్ క్లాసులు తీసుకుంటున్నా ఈ అమ్మడి వైపే కళ్లన్నీ. సోషల్ మీడియాల్లో యూత్ పిచ్చెక్కి కామెంట్లు చేస్తుంటారు.
దిశా పూర్తిగా కెరీర్ పైనే శ్రద్ధ పెట్టింది. ఆ క్రమంలోనే వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కొత్త వాటికి కథలు వింటోంది. ఇటీవలే భారత్ చిత్రంలో రాధ పాత్రలో నటించింది. నర్తకి రాధగా మైమరిపించింది. తదుపరి `మళంగ్` అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఆదిత్య రాయ్ కపూర్- అనీల్ కపూర్- కునాల్ ఖీము వంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
తాజాగా ఏక్తా కపూర్ నిర్మిస్తున్న తాజా చిత్రంలో కే.టీనా అనే పాత్రలో నటిస్తోంది. తాజా షెడ్యూల్స్ లో పాల్గొంటూ బిజీగా ఉంది. ఇది ఏక్తా కపూర్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న సినిమా అన్న ప్రచారం ఉంది. అయితే దానిని మేకర్స్ ధృవీకరించలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై నుంచి చండీఘర్ కి వెళ్లింది దిశా. అక్కడ షెడ్యూల్ పూర్తవ్వగానే తిరిగి ముంబై కి చేరుకుంది. ఆ క్రమంలోనే విమానాశ్రయంలో ఫోటోలకు ఫోజులిచ్చిందిలా

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/