కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటోంది

Disha Patani-1
Disha Patani

బాఘీ-2 తరవాత వెంటనే ఆఫర్లు రాకపోడంతో దిశా మళ్లీ తన అందాలనే నమ్ముకుంది.  బీచ్ లో బికినీలు వేసుకుని ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండేది. దిశా అందాలకు ఫిదా అయిపోయిన నెటిజన్లు ఆమెకు ఫ్యాన్స్ గా మారిపోయారు. ఎట్టకేలకు ఆమె ఎదురుచూపులు ఫలించాయి. ఏకంగా టాప్ హీరో సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో వస్తున్న భరత్ సినిమాలో దిశా పఠానీ ఓ జిమ్నాస్టిక్ గర్ల్ గా కనిపించనుంది. జిమ్నాస్ట్ గర్ల్ గా కనిపించడమంటే అంత తేలికేం కాదు. అందుకోసం దిశా కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటోంది. ముంబయిలో జోరువాన పడుతున్నా తన ట్రైనింగ్ కంటిన్యూ చేసింది. ఇది డైరెక్టర్ అలీ అబ్బాస్ కు తెగ నచ్చేసింది. దిశ ఎంత కష్టపడుతుందో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దిశా పఠానీ కష్టపడి.. అంకితభావంతో పనిచేసే అమ్మాయి అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చేశాడు.