రూ. 5 కోట్ల భారీ మొత్తo డిమాండ్

DISHA PATANI1
DISHA PATANI

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ దిశా పటాని. ఇక ఈ చిత్రం పరాజయం పాలవ్వడంతో తరువాత ఆమె బాలీవుడ్ లోకి వెళ్ళింది. అక్కడ అవకాశాలు సంపాదించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.ఇక ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి తెరకెక్కించనున్న’సంఘమిత్ర’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనున్నది దిశా. ఈ చిత్రం కోసం ఆమె రూ. 5 కోట్ల భారీ మొత్తాన్నిడిమాండ్ చేసిందట. అందుకు చిత్ర నిర్మాతలు కూడా అంగీక‌రించార‌ని సమాచారం. రూ.400కోట్ల భారీ బడ్జెతో రానున్న ఈచిత్రంలో జయం రవి , ఆర్య ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఆగష్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తేనండాల్ స్టూడియోస్ నిర్మించనుంది.