దిశ నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్‌ జరుపలేదు

Disha case Victims
Disha case Victims

హైదరాబాద్‌: దిశ నిందితుల మృతదేహాలకు నగరంలోని గాంధీ ఆసుపత్రిలో రీపోస్టుమార్టం జరుగుతుందని గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిమ్స్‌ నుంచి నలుగురు వైద్యులు రీపోస్టుమార్టం నిమిత్తం వచ్చారని ఆయన తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో కూడా ఎయిమ్స్‌ బృందం మాట్లాడిందని ఆయన వెల్లడించారు. రీపోస్టుమార్టం వీడియో రికార్డింగ్‌ మధ్యనే జరుగుతోందని, మొదటిసారి జరిగిన పోస్టుమార్టం సీడీని హైకోర్టుకు సమర్పించామని అన్నారు. అంతేకాకుండా రీపోస్టుమార్టం సీడీని కూడా హైకోర్టుకు అందజేయనున్నామని ఆయన తెలిపారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించారని శ్రవణ్‌ తెలిపారు. కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకున్న తర్వాత మృతదేహాలను అప్పగిస్తామని ఆయన చెప్పారు. అంతేకాకుండా నిందితుల మృతదేహాలు సగం కుళ్లిన కారణంగా ఎంబామింగ్‌ చేయలేదని కూడా గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/