ఎన్‌కౌంటర్‌పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

etela rajender
etela rajender

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ మంత్రి ఈటెల రాజేందర్‌ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను పరోక్షంగా తప్పుపట్టారు. దిశ లాంటి ఘటనల్లో ఎన్‌కౌంటర్లు పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉరిశిక్షలు కూడా పరిష్కారం కాదనీ, అవి తాత్కాలిక పరిష్కారేలనని అన్నారు. సమాజంలో మార్పు వచ్చినప్పుడే ఇలాంటి ఘటనలు జరగవని ఆయన అన్నారు. టెక్నాలజీ లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి కానీ, అదే మనిషి జీవితాన్ని విధ్వంసం చేస్తుందని మనిషి ఊహించలేకపోయాడని వ్యాఖ్యానించారు. ఇంకా సెల్‌ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ మానవ జీవితాన్ని విధ్వంసం చేస్తున్నాయనీ అన్నారు. తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తుపై భయం వేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బయటకి వెళ్తే క్షేమంగా వస్తామన్న నమ్మకం లేదనీ, కొన్ని సందర్భాలలో కంచే చేను మేసినట్లుగా పిల్లలపై తండ్రులే క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/